బాహుబలిలో శ్రీదేవి చేయకపోవదానికి కారణం చెప్పిన వర్మ ?

Monday, April 30th, 2018, 10:35:00 AM IST

బాహుబలి లో శివగామిదేవిగా అనలేని కీర్తిని అందుకుంది రమ్యకృష్ణ. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ఈ పాత్రకోసం ముందు శ్రీదేవి ని అనుకున్నారని .. కానీ ఆమెను సంప్రదిస్తే భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో, ఇంకా ఏవేవో షరతులు పెట్టిందని దాంతో ఆమె పాత్రలో రమ్యకృష్ణను ఎంచుకున్నట్టు రాజమౌళి తెలిపాడు. ఈ విషయం పై శ్రీదేవి ఓ ఇంటర్వ్యూ లో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాను ఈ సినిమాలో నటించేందుకు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలేదని, ఏ కండిషన్స్ కూడా పెట్టలేదని ఆమె పేర్కొంది. అసలు ఇలాంటి డిమాండ్లు ఎవరైనా చేస్తారా .. చేస్తే నేను ఇంతపెద్ద స్టార్ ను అయ్యేదాన్నా అని చెప్పింది. ఈ విషయం పక్కన పెడితే అసలు బాహుబలి లో శ్రీదేవి నటించక పోవడానికి కారణం ఆమె భర్త బోనీ కపూర్ అంటూ ఫైర్ అయ్యాడు సంచలన దర్శకుడు వర్మ. తాజగా ఈ విషయం పై అయన స్పందిస్తూ బాహుబలి సినిమా అవకాశం వచ్చిందన్న విషయాన్నీ శ్రీదేవి తనకు చెప్పిందని, ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపిందన్నారు. అయితే తన భర్త బోణి కపూర్ భారీ రెమ్యూనరేషన్ అడగమని ఒత్తిడి చేసాడని, కొన్ని డిమాండ్స్ కూడా పెట్టడంతోనే ఆమె ఈ మంచి అవకాశాన్ని కోల్పోయిందని తెలిపాడు వర్మ . బోణి కపూర్ నిర్ణయం వల్లే శ్రీదేవి అంతమంచి అవకాశం మిస్ చేసుకుందని అన్నారు. బోణి నిర్ణయాల వల్ల శ్రీదేవి తన కెరీర్ లో చాలా నష్టపోయిందని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments