ఆఫీసర్ కోసం క్రేజీ దర్శకులను దింపుతున్న వర్మ ?

Saturday, May 26th, 2018, 06:14:38 PM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ .. తన సినిమాల విషయంలో ప్లాప్ అయి ఉంటాడు కానీ ప్రమోషన్ లో కాదు. తన సినిమాకు ఎలాంటి ప్రమోషన్ చెయ్యాలో .. ఎలా చెయ్యాలో బాగా తెలిసిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. సినిమాలతోనే కాదు పలు ఘాటు కామెంట్స్ తో సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేసే వర్మ తాజగా నాగార్జునతో ఆఫీసర్ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమా జూన్ 1న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇద్దరు క్రేజీ దర్శకులను రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ క్రేజీ దర్శకులు ఎవరో కాదు .. రాజమౌళి, సుకుమార్? త్వరలో జరిగే ఈ ఈవెంట్ లో వీరిద్దరూ పాల్గొంటారట. ఈ మధ్య పలు సినిమాలకు పవన్ కళ్యాణ్ రావడం .. దాంతో ఆ సినిమాకు భారీ హైప్ వచ్చిన నేపథ్యంలో వర్మ.. పవన్ కు ధీటుగా ఉంటుందని ఈ ఇద్దరు దర్శకులను రంగంలోకి దింపుతున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments