పవన్ కంటే కత్తి మహేష్ అందంగా ఉంటాడంటూ వర్మ కౌంటర్ ?

Thursday, January 11th, 2018, 10:56:04 AM IST

మరో సారి సోషల్ మీడియా వీరుడు రామ్ గోపాల్ వర్మ మరో సారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసాడు. ఈ మధ్య పవన్ ను టార్గెట్ చేస్తున్న వర్మ తాజాగా కత్తి మహేష్ కి సపోర్ట్ గా మాట్లాడుతూ కౌంటర్ వేసాడు. పవన్ కంటే కూడా కత్తి మహేష్ అందంగా ఉంటాడని సోషల్ మీడియా లో పేర్కొన్నాడు. అజ్ఞాతవాసి సినిమాకు సంబందించిన రివ్యూ వీడియొ ను చుసిన వర్మ .. ఈ కామెంట్ చేసాడు. దాంతో ఉబ్బి తబ్బిబ్బయినా కత్తి .. థాంక్యూ అంటూ రిప్లయ్ ఇచ్చాడు. మొత్తానికి పవన్ ని విమర్శించే వారు ఒక్కటయినట్టువుంది వ్యవహారం. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆయనను టార్గెట్ చేస్తున్న వర్మ , కత్తి లపై అటు పవన్ ఫాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి.