ఓటర్లను అవమానపరిచిన పవన్ కళ్యాణ్ – సంచలన దర్శకుడు

Sunday, June 9th, 2019, 12:40:39 PM IST

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ గోరమైన పరాజయం పాలైన సంగతి మనకు తెలిసిందే… కాగా ఈ ఓటమి మీద స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరులోని మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ తనని ఓడించడానికి ప్రత్యర్ధులు 150 కోట్లు ఖర్చు పెట్టారని, తనని అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా కుట్రపూరితమైన రాజకీయాలు చేశారని, ఒకవేళ తానూ గనక అసెంబ్లీలో అడుగుపెడితే అందరి బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో నీచరాజకీయాలు చేశారని పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాగా జనేనని మాట్లాడిన మాటలపై స్పందించిన సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ ఒక ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న దాని ప్రకారం చుస్తే… పవన్ కళ్యాణ్ ఓడిపోడానికి కారణం ప్రత్యర్ధులు ఓటర్లకు 150 కోట్లు పంచారని ఆరోపిస్తున్నారు. ఆలా చెప్పి పవన్, ఓటర్లను అవమాన పరుస్తున్నారు. ఒకవేళ నిజానికి పవన్ అధికారంలోకి రావాలని ఓటర్లు కోరుకొని ఉంటె ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్న కూడా పవన్ కే ఓటేసేవారని వర్మ అన్నారు. అంతేకాకుండా ఒకవేళ పవన్ కూడా ఓటర్లకు డబ్బులు పంచితే పరిస్థితి ఎలా ఉండేది అనే అర్థం వచ్చేలా వర్మ ట్వీట్ చేశాడు.