సూపర్ స్టార్ కు వర్మ అభినందనలు!

Thursday, April 19th, 2018, 08:59:47 PM IST


సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, హ్యాట్రిక్ విజ‌యాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం `భ‌ర‌త్ అనే నేను`. ఇప్పటికే భారీ అంచనాలతో రానున్న ఈ సినిమా రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు మేనియా కనపడుతోంది. బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలతో అభిమానులను కాస్త నిరాశపరిచిన సూపర్ స్టార్, ఈ సినిమాతో ఎలాగైనా గట్టిగ హిట్ కొట్టాలని చూస్తున్నారు. పైగా సెన్సార్ అయినా తర్వాత ఈ సినిమాకు వారినుండి పాజిటివ్ రిపోర్ట్ రావడం, అలానే ఎప్పుడు సినిమా విడుదల తర్వాత తన కుటుంబంతో టూర్ వెళ్లే మహేష్, ఈ సారి సినిమా విడుదలకు ముందే వెళ్లి రావడం వంటి అంశాలు ఈ సినిమాపై యూనిట్ కు చాలా నమ్మకం వుందనడాన్ని తెలియచేస్తోంది.

కాగా ఈ సినిమాలో మ‌హేష్ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి ఒక థియేటర్ లో ఏర్పాటు చేసిన క‌టౌట్‌పై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ స్పందించారు. త‌న ట్విట‌ర్ ఖాతా ద్వారా `భ‌ర‌త్ అనే నేను` టీమ్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. కటౌట్ చాలా అద్భుతంగా ఉంది. `భ‌ర‌త్ అనే నేను` టీమ్‌కు శుభాకాంక్ష‌లు` అంటూ వ‌ర్మ ట్వీట్ చేశారు….

  •  
  •  
  •  
  •  

Comments