వర్మ జీఎస్టీ చూడాలంటే డబ్బులు కట్టాల్సిందే ?

Thursday, January 25th, 2018, 01:42:04 PM IST


వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన జీఎస్టీ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధం అయింది. ఇప్పటీకే ఈ సినిమా పై సంచలనాలు రేకెత్తుతున్నాయి. వర్మ పోర్న్ ఫిలిం తీసాడంటూ జనాలు మండి పడుతున్నారు. అయితే వర్మ తీసిన జీఎస్టీ సినిమాకు చూసేందుకు కొంత మంది రెడీ అవుతున్నారు కూడా. ఏంటి వర్మ తీసే ఈ పోర్న్ సారీ .. హాట్ సినిమాను ఫ్రీ గా చేసేయాలని అనుకుంటున్నారా ? అంత ఛాన్స్ లేదండోయ్ .. జీఎస్టీ చూడాలంటే తప్పకుండ డబ్బులు పెట్టె తీరాలి ? అవును ఇది ఫ్రీగా చూసే సినిమా కాదని చెబుతున్నాడు .. ఇప్పటికే పోర్న్ పాప మియామి కూడా ప్రమోషన్ విషయంలో వర్మకు బాగా సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా పై జనల ఆసక్తి రెట్టింపవుతుంది. మరి త్వరలోనే విడుదల కానున్న వర్మ జీఎస్టీ చూడాలంటే 150 రూపాయలు తప్పని సరి.