జాక్వెలిన్ కారులో షర్ట్ లేకుండా దొరికిన హీరో..ఏం జరిగింది..?

Monday, September 25th, 2017, 03:35:19 PM IST


వరుణ్ ధావన్ బాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, తాప్సి లతో ఆడిపాడిన జూడ్వా 2 చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. దీనితో ఈ హీరో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఓ ప్రమోషన్ కార్యక్రమం లోసం జాక్వెలిన్ తో కల్సి వెళ్లిన వరుణ్ ధావన్ ఆ తరువాత ఆమె కారులోనే అంబానీ ఇచ్చిన పార్టీకి అటెండ్ అయ్యాడు. జాక్వెలిన్ కారులో వరుణ్ ధావన్ అర్థనగ్నంగా కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అసలు విషయం ఏంటంటే.. పార్టీకి వెళ్లే సమయంలో తీరిక లేకపోవడంతో వరుణ్ జాక్వెలిన్ కారులోనే బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది. వరుణ్ బట్టలు మార్చుకుంటుంటే ఈ శ్రీలంక బ్యూటీ లోని చిలిపిదనం బయట పడింది. వరుణ్ ధావన్ బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు నెటిజల్లో ఆ వీడియో చక్కర్లు కొడుతోంది. తన కారుని చేంజ్ రూమ్ గా మార్చిందకు వరుణ్ కి థాంక్స్ కూడా చెప్పింది.

  •  
  •  
  •  
  •  

Comments