వీడియో: ఈ బుల్లోడు అచ్చం స‌ల్మాన్ పోలికే!

Tuesday, March 13th, 2018, 10:03:20 PM IST


స‌ల్మాన్ ఖాన్ 54 వ‌య‌సు వ‌చ్చేసినా, ఇంకా పెళ్లి చేసుకోలేదు. అలాంట‌ప్పుడు త‌న‌కు వార‌సుడు ఉండే ఛాన్సే లేదు .. అయితే స‌ల్మాన్ వార‌స‌త్వాన్ని .. లెగ‌సీని ముందుకు తీసుకెళ్లేదెవ‌రు? అన్నివేళ‌లా హాట్ డిబేట్ ఇది. అయితే స‌ల్మాన్ ఆస్తుల‌కు వార‌సుడు లేక‌పోయినా, స‌ల్మాన్ ర‌క్తం పంచుకుని పుట్ట‌క‌పోయినా ఆల్మోస్ట్ త‌న‌కు వార‌సుడంటి వాడు వ‌రుణ్ ధావ‌న్ అన్న సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ అభిమానిగా, స‌ల్మాన్ ఎంత‌గానో అభిమానించే ధావ‌న్ బోయ్‌గా వ‌రుణ్ కి విప‌రీత‌మైన క్రేజు నెల‌కొంది. ఇటీవ‌లే స‌ల్మాన్ సినిమా `జుడ్వా`ని రీమేక్ చేసి 100 కోట్ల క్ల‌బ్ హీరోగా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్నాడు. ఇక అదే ఊపులో అత‌డు నటించిన `అక్టోబ‌ర్` రిలీజ్‌కి రెడీ అవుతోంది.

ఈ సినిమా తాజా ట్రైల‌ర్ ఇలా రిలీజైందో లేదో అలా కొన్ని గంట‌ల్లోనే కోటి వ్యూస్ అందుకుని దూసుకుపోయింది. ధావ‌న్‌కి అంత పెద్ద రేంజులో ప్ర‌మోష‌న్ రావ‌డం వెన‌క స‌ల్మాన్ ఖాన్ అభిమానుల అండా దండా ఉన్నాయ‌న‌డంలో సందేహం లేదు. ధావ‌న్ క్రేజు అంత‌కంతకు పెరుగుతోందంటే తండ్రి త‌ర్వాత తండ్రి అంత‌టివాడైన స‌ల్మాన్ అండా దండా వ‌ల్ల‌నే. ఇదిగో ఈ ట్రైల‌ర్ అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రేమ‌లోని స్వ‌చ్ఛ‌త‌కు సింబాలిక్‌గా ఉండ‌డంతో యువ‌త‌రానికి బాగా న‌చ్చేస్తోంది. ఓ స్టార్ హోల‌ల్లో ప‌ని చేసే ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌క‌థ‌ను ఈ సినిమాలో చూపిస్తున్నార‌ని ట్రైల‌ర్ చెబుతోంది. వ‌రుణ్ ధావ‌న్‌- బాంటియా సంధు జంట‌గా న‌టించిన అక్టోబ‌ర్`చిత్రానికి సుర్జీత్ సిర్కార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

  •  
  •  
  •  
  •  

Comments