వరుణ్ సినిమా స్టార్ట్ కాకముందే 24 కోట్లా?

Friday, February 23rd, 2018, 05:59:12 PM IST

ఫిదా – తొలి ప్రేమ సినిమాలతో మంచి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమాతో కూడా హిట్టు కొట్టాలని అనుకుంటున్నాడు. అందుకోసం ఫిట్ నెస్ లో కొన్ని మార్పులు చేస్తున్నాడు. ఇకపోతే వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఇంకా స్టార్ట్ కూడా కాలేదు అప్పుడే బిజినెస్ మొదలైంది. ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డి నెక్స్ట్ వరుణ్ తో స్పెస్ తరహాలో సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు రూ 2.75కోట్లకు ధర పలుకుతోందని సమాచారం.

వరుణ్ ఫిదా – తొలిప్రేమ ఓవర్సీస్ లో మంచి వసూళ్లను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక దర్శకుడు సంకల్ప్ రెడ్డి తీసిన ఘాజి కూడా అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ కాంబినేషన్ పై అంచనాలు పెరిగాయి. మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే సినిమాను దర్శకుడు క్రిష్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. రాజీవ్ రెడ్డి సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. దీంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ విషయం తెలుసుకున్న దిల్ రాజు కూడా సినిమా నిర్మాణంలో భాగం కావాలని అనుకుంటున్నారట. కాన్సెప్ట్ నచ్చడంతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా థియేట్రికల్ రైట్స్ ను 18 కోట్లకు అందుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఆ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతోంది.