వ‌రుణ్‌తేజ్ మ‌రో సినిమా ఒప్పుకొన్నాడు

Saturday, September 17th, 2016, 02:56:36 PM IST

varun
ఇప్పుడు మెగా హీరోల్లో జోరంటే వ‌రుణ్‌తేజ్‌దే. ఎవ్వ‌రి ద‌గ్గ‌రికీ వెళ్ల‌న‌న్ని క‌థ‌లు ఆయ‌న ద‌గ్గ‌రికి వెళుతున్నాయి. మెగా క‌థానాయ‌కుల్లోఎవ్వ‌రూ చేయ‌న‌న్ని సినిమాల్ని ఆయ‌న చేస్తున్నాడు. ఇదే ఊపు కొన‌సాగితే ఆయన కెరీర్ మ‌రోస్థాయికి వెళ్ల‌డం ఖాయం. ఇప్ప‌టికే శ్రీనువైట్ల‌, శేఖ‌ర్క‌ మ్ముల‌లాంటి అగ్ర ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేస్తున్నాడు వ‌రుణ్‌తేజ్‌. త‌దుప‌రి కార్తికేయ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. దానికితోడు దిల్‌రాజు సంస్థ‌లో మ‌రో సినిమా కూడా ఉంద‌ట‌. అదొక కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించబోయే సినిమా. వీటిమ‌ధ్య‌లో మ‌రో సినిమాకీ వ‌రుణ్ ఓకే చెప్పేశాడు. విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్న ఆసినిమా క‌న్‌ఫ్యూజ‌న్ కామెడీతో తెర‌కెక్క‌నుంద‌ని తెలిసింది. ఇప్ప‌టికే ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు పూర్త‌య్యాయ‌ని, వీలు చూసుకొని సినిమాని ప‌ట్టాలెక్కిద్దామ‌ని మాట్లాడుకొన్న‌ట్టు తెలిసింది. విజ‌య్ కుమార్ కొండా ఇదివ‌ర‌కు `గుండె జారి గ‌ల్లంత‌య్యిందే`, `ఒక లైలా కోసం` చిత్రాల‌తో విజ‌యాల్ని సొంతం చేసుకొన్నాడు.