మరో దర్శకుడికి ఓకే చెప్పిన వరుణ్ తేజ్ ?

Tuesday, March 6th, 2018, 09:47:37 AM IST

కెరీర్ మొదటి నుండి భిన్నమైన సినిమాలను చేస్తూ వరుస విజయాలతో జోరుమీదున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా తొలిప్రేమ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డి తో స్పేస్ సినిమా చేస్తున్నాడు. తెలుగులో రూపొందే మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల లోనే సెట్స్ పైకి రానుంది. ఇక ఈ సినిమా తరువాత వరుణ్ మరో దర్శకుడికి ఓకే చెప్పాడు. ఇంతకి ఆ దర్శకుడు ఎవరో తెలుసా అప్పట్లో ఒకడుండేవాడు సినిమా తో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న సాగర్ చంద్ర. తాజాగా సాగర్ చంద్ర చెప్పిన కథ నచ్చడంతో వరుణ్ ఓకే చెప్పాడని తెలిసింది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ నిర్మిస్తుందట. ఈ సినిమా కూడా భిన్నమైన నేపథ్యంలో ఉంటుందని టాక్.