లోకల్ దర్శకుడితో .. వరుణ్ తేజ్ ?

Friday, July 27th, 2018, 07:55:16 PM IST

మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా సినిమాకు తన ఇమేజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు. కమర్షియల్ ఊబిలో పడకుండా భిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో స్పేస్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఘాజి తో మంచి క్రేజ్ తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి ప్రస్తుతం భారీ బడ్జెట్ తో స్పేస్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో వరుణ్ వ్యోమగామి గా కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తరువాత వరుణ్ మరో క్రేజీ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు ఈ మద్యే నాని హీరోగా నేను లోకల్ అంటూ సూపర్ హిట్ ఇచ్చిన త్రినాద్ రావు నక్కిన. తాజగా రామ్ తో హలొ గురు ప్రేమకోసమే సినిమా చేస్తున్న అయన తన తదుపరి చిత్రాన్ని వరుణ్ తో ప్లాన్ చేస్తున్నాడు. తాజగా ఆయనకు కథ కూడా వినిపించాడని టాక్. కథ నచ్చడంతో వరుణ్ కూడా ఓకే చెప్పాడట. ప్రస్తుతం రామ్ సినిమా చివరి దశలో ఉంది. అలాగే వరుణ్ కూడా సంకల్ప్ రెడ్డి సినిమా, అలాగే అనిల్ రావిపూడి ఎఫ్ 2 సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాల తరువాత త్రినాధ్ రావు సినిమా పట్టాలు ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments