రామ్ చరణ్ అభిమానులకు వరుణ్ తేజ్ గిఫ్ట్..!

Friday, March 26th, 2021, 12:00:59 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. అయితే రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు పురస్కరించుకొని అభిమానులు ఇప్పటి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే మెగా హీరో వరుణ్ తేజ్ రామ్ చరణ్ అభిమానుల కోసం ఒక గిఫ్ట్ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు పాత్ర కి సంబందించిన యానిమేషన్ పోస్టర్ ను విడుదల చేసారు వరుణ్. అయితే వరుణ్ విడుదల చేసిన వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే రౌద్రం రణం రుధిరం చిత్ర యూనిట్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక పోస్టర్ ను విడుదల చేయనుంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు అందుకు సంబంధించిన పోస్టర్ విడుదల కానుంది. అయితే ఈ విషయం పై రామ్ గోపాల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి చెందిన మరొక పోస్టర్ విడుదల కానుండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ కి సంబంధించిన పలు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న చిత్రానికి ఇంకా టైటిల్ ప్రకటించలేదు. మరి దీని పై అప్డేట్ వస్తుందా లేదా అనేది ఆసక్తి గా మారింది. మరో పక్క తండ్రి తో ఆచార్య చిత్రం లో నటిస్తున్న రామ్ చరణ్ కి చిత్ర యూనిట్ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుందో చూడాలి.