వరుణ్ తొలిప్రేమ బాగానే వర్కవుట్ అయింది ?

Tuesday, February 13th, 2018, 09:26:35 PM IST

మెగా హీరో వరుణ్ తేజ్ అన్నట్టుగానే మరో సక్సెస్ ని తొలిప్రేమ రూపంలో అందుకున్నాడు. కెరీర్ మొదటినుండి భిన్నమైన సినిమాలతో దూసుకుపోతున్న వరుణ్ తాజాగా ప్యూర్ ప్రేమకథగా తెరకెక్కిన తొలిప్రేమ విడుదలైన అన్ని ప్రాంతాల్లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. రాశి ఖన్నా హీరోయిన్ గా కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఒకరోజు ఆలస్యంగా విడుదల కావడం కూడా సినిమాకు బాగా కలిసి వచ్చినట్టైంది. మరో మెగా హీరో సాయి ధరమ్ నటించిన ఇంటిలిజెంట్ సినిమా కూడా ఒకేరోజు విడుదలకు ప్లాన్ చేసారు .. కానీ రెండు మెగా హీరోల సినిమాలు ఒకేరోజు రావడం సేఫ్ కాదని భావించిన నిర్మాతలు ఒకరోజు ఆలస్యంగా విడుదల చేసారు. తొలిప్రేమ మూడు రోజులకె దాదాపు 23 కోట్లు రాబట్టి దుమ్ము రేపుతోంది. మరి ఆ వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.. షేర్ లలో .. నైజాం – 3. 05 కోట్లు, సీడెడ్ – 01. 02 కోట్లు, నెల్లూరు – 0. 38 కోట్లు, గుంటూరు – 0. 75 కోట్లు, కృష్ణా – 0. 66 కోట్లు, వెస్ట్ – 0 . 55 కోట్లు, ఈస్ట్ – 0. 64 కోట్లు, ఉత్తరాంధ్రా – 1. 15 కోట్లు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి – 08 . 10 కోట్లు, ( గ్రాస్ – 14. 05 కోట్లు ), మూడు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా కలిసి 11 . 06 కోట్లు ( 21 కోట్లు ). ఇక మహా శివరాత్రి .. ప్రేమికుల రోజు కలుపుకుని దాదాపు 223 కోట్లకు పైగా వసూలు అవ్వడంతో సందేహం లేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.