వండ‌ర్ ఉమెన్‌కు కాపీ లుక్

Sunday, May 20th, 2018, 02:15:44 AM IST

శృంగార తార‌ స‌న్నీలియోన్ టైటిల్ పాత్ర పోషిస్తున్న `వీర‌మాదేవి` ఫ‌స్ట్‌లుక్‌కి చ‌క్క‌ని ప్ర‌శంస‌లొస్తున్న సంగ‌తి తెలిసిందే. హిస్టారిక‌ల్‌ వారియ‌ర్ క్వీన్‌గా స‌న్నీ లుక్ పెర్ఫెక్ట్‌గా ఉందన్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్‌తో స‌న్నీ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ్‌, హిందీలో అత్యంత‌ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ కానుంది. వి.సి.వ‌డివుడ‌య‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. లేటెస్టుగా రిలీజైన వీర‌మాదేవి లుక్ ఏ సినిమాకి స్ఫూర్తి? అని అంత‌ర్జాలంలో శోధిస్తే ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి తెలిసొచ్చింది. వీర‌మాదేవిగా స‌న్నీ లుక్ అచ్ఛం `వండ‌ర్ ఉమెన్‌`ని త‌ల‌పించింది. ప్ర‌ఖ్యాత హాలీవుడ్ న‌టి గాల్ గాడోట్ న‌టించిన వండ‌ర్ ఉమెన్ గ‌త ఏడాది రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ సినిమా ఆస్కార్ నామినేష‌న్ల‌కు వెళ్లింది. అయితే అలాంటి గ్రేట్ మూవీ లుక్‌కి `వీర‌మాదేవి` లుక్‌కి పోలిక‌లు క‌నిపించ‌డం ప్ర‌స్తుతం సంచ‌ల‌న‌మైంది.

అంతేకాదు .. గాల్ గాడోట్, స‌న్నీలియోన్ ఇద్ద‌రినీ ప‌క్క ప‌క్క‌నే నిల‌బెడితే అక్కా చెల్లెళ్ల‌ను త‌ల‌పిస్తారు. ఆ ఇద్ద‌రి విగ్ర‌హాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఇప్పుడు వీర‌మాదేవి పాత్ర‌కు రూపొందించిన క‌వ‌చం, చేతి క‌వ‌చం, కిరీటం అన్నీ అచ్చం వండ‌ర్ ఉమెన్ ఆభ‌ర‌ణాల‌ను పోలి క‌నిపిస్తున్నాయి. స‌న్నీ లుక్‌ని వండ‌ర్ ఉమెన్‌ని చూసి డిజైన్ చేశారా? లేక కేవ‌లం స్ఫూర్తి పొందారా? అన్న‌ది చిత్ర‌యూనిట్‌నే చెప్పాలి. ఇక‌పోతే బ‌డ్జెట్‌, కాన్వాసు ప‌రంగా వండ‌ర్ ఉమెన్ స్థాయి కాదు కాబ‌ట్టి, వీర‌మాదేవిని ఆ సినిమాతో పోల్చి చెప్ప‌లేం. అయితే విజువ‌ల్స్ ప‌రంగా నాణ్య‌త‌, క‌థ ప‌రంగా గొప్ప మ‌లుపులు ఉంటే ఈ సినిమా పెద్ద స్థాయికి చేరుతుంద‌న‌డంలో సందేహం లేదు

  •  
  •  
  •  
  •  

Comments