ఈ సినిమాని డ‌ర్టీపిక్చ‌ర్‌తో పోల్చారు

Thursday, May 31st, 2018, 01:22:08 PM IST

భార‌తదేశంలో భార‌తీయ సినిమాల‌కు ఉన్న స్వేచ్ఛ విదేశాల్లో ఉంటుందా? అంటే.. మ‌న సినిమాల రిలీజ్‌ల‌కు స్వేచ్ఛ అనేదే ఉండ‌దని ట్రేడ్ చెబుతోంది. మ‌న సినిమాని రిలీజ్ చేయాలంటే అక్క‌డ ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్థానిక పంపిణీ సంస్థ‌ల‌కు క‌ప్పం క‌ట్టాల్సి ఉంటుంది. పైగా సీబీఎఫ్‌సీ గ‌డ‌ప మీద ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. అక్క‌డ లోక‌ల్ ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ తినే కంటెంట్ ఉంటే అస్స‌లు స‌హించ‌రు. ఇక ఛాంద‌స‌వాద శ‌త్రుదేశం.. బుర్ఖా ల్యాండ్‌ పాకిస్తాన్‌లో అయితే మ‌రీ దారుణమైన రూల్స్ ఉన్నాయి. అస‌లు ఇండియా అంటేనే అంతెత్తున లేచే పాకిస్తానీలు.. మ‌న సినిమా పాకిస్తాన్‌లో రిలీజ్ చేయాలంటే అంతే అడ్డంకులు సృష్టిస్తుంటారు. సినిమాల విష‌యంలో పాక్ ప్ర‌భుత్వ‌మే నేరుగా జోక్యం చేసుకుంటుంది. ఇదివ‌ర‌కూ ఎన్నో బాలీవుడ్ సినిమాల్ని పాకిస్తాన్‌లో రిలీజ్ కానీకుండా అడ్డుకున్నారు.

ఇప్పుడు సేమ్ స‌న్నివేశం ఎదుర్కొంటోంది వీరే ది వెడ్డింగ్‌. ఈ చిత్రంలో లెక్క‌కుమిక్కిలిగా బూతు స‌న్నివేశాలున్నాయ‌ని, సంభాష‌ణ‌ల్లో ద్వంద్వార్థం ధ్వ‌నిస్తోంద‌ని పాకిస్తాన్ సీబీఎఫ్‌సీ రిలీజ్‌కి అడ్డంకి చెప్పింది. పెళ్లి త‌ర‌వాత స్వేచ్ఛ‌పై విశృంఖ‌లంగా చూపించార‌న్న వాద‌నా పాక్ సెన్సార్ వినిపించింది. మొత్తానికి మ‌రో ఇండియ‌న్ సినిమాపై పాక్ క‌క్ష తీర్చుకుంద‌నే చెప్పాలి. ఇక‌పోతే మ‌న డ‌ర్టీపిక్చ‌ర్లు విదేశాల్లో ఆడ‌డం అనేది అంత ఈజీ కాద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. రియాక‌పూర్‌, ఏక్తాక‌పూర్ నిర్మాత‌లుగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో కరీనాక‌పూర్‌, సోన‌మ్ క‌పూర్‌, స్వ‌రాభాస్క‌ర్ త‌దిత‌రులు న‌టించారు. ఇటీవ‌లే రిలీజైన ట్రైల‌ర్‌కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. పెళ్లి త‌ర‌వాత మ‌హిళా స్వేచ్ఛ అన్న కాన్సెప్టుతో తెర‌కెక్కింది ఈ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. అయితే ఇలాంటి సినిమాని డ‌ర్టీపిక్చ‌ర్‌తో పోల్చింది పాక్ సీబీఎఫ్‌సీ. బూతు జోకులు, కుళ్లు స‌న్నివేశాలు అంటూ తీసిపారేసింది.