ఫ‌స్ట్‌లుక్ : పోస్ట‌ర్‌లోనే పిల్ల‌ను వెతుక్కుంటారు!

Tuesday, October 24th, 2017, 08:24:12 PM IST

చిన్నారి థైమూర్ జ‌న‌నం త‌ర్వాత క‌రీనాక‌పూర్ సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత‌ తిరిగి చాలా గ్యాప్ ఇచ్చి రీఎంట్రీ ఇస్తోంది. ప్ర‌స్తుతం క‌రీనా న‌టిస్తున్న `వీర్ ది వెడ్డింగ్‌` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఆన్ లొకేష‌న్ స్టిల్స్‌, వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ లోగానే చిత్ర‌యూనిట్ మూవీ ఫ‌స్ట్‌లుక్ అధికారికంగా లాంచ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో బెబో తో పాటు సోన‌మ్ క‌పూర్‌, స్వ‌ర‌భాస్క‌ర్‌, శిఖ త‌ల‌సానియా .. శారీ లుక్ రివీల్ చేశారు. సినిమా క‌థాంశాన్ని రివీల్ చేసే ఆస‌క్తిక‌ర పోస్ట‌ర్ ఇది.

న‌లుగురు అమ్మాయిలు ఓ పెళ్లికి వెళ్లాక అక్క‌డ ఏం జ‌రిగింది? అన్న ఆస‌క్తిక‌ర కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. పోస్ట‌ర్‌లోని గ్లింప్స్ చూస్తుంటే .. పెళ్లికి వెళ్లిన గాళ్స్ చేసిన చిలిపి అల్ల‌రి ప‌నులేంటి? అన్న‌ది ఆస‌క్తిక‌రం అని అర్థ‌మ‌వుతోంది. పెళ్లిలో సంద‌డి ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తున్నార‌ని అర్థం చేసుకోవ‌చ్చు.
వీర్ ది వెడ్డింగ్ వాస్త‌వానికి గ‌త ఏడాది ప్రారంభం కావాల్సింది. కానీ క‌రీనా ఫ్రెగ్నెన్సీ వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. శ‌షాంక ఘోష్ ద‌ర్శ‌క‌త్వంలో రియా క‌పూర్‌, ఏక్తాక‌పూర్‌, నిఖిల్ ద్వివేది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments