పిక్ టాక్ : వెడ్డింగ్ గాళ్స్ ప‌రేష‌నూ..

Saturday, May 26th, 2018, 07:16:51 PM IST

.

వ‌న్నె చిన్నెల‌ వ‌య్యారాల్ని.. వ‌డ్డించేందుకు ఏమాత్రం జంకూ గొంకూ చూపించని మోడ్ర‌న్ యూత్‌ని వీరే ది వెడ్డింగ్ చిత్రంలో చూపించ‌నున్నారు. పెళ్లి చేసుకుని ఆ త‌ర‌వాత కూడా ఏమాత్రం స్వేచ్ఛ‌కు అడ్డంకులు లేకుండా బ‌తికేసే మోడ్ర‌న్ గాళ్స్‌ని తెర‌పై చూపించ‌నున్నారు. ఈ కాన్సెప్టులోనే సంథింగ్ ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇటీవ‌లే వీరే ది వెడ్డింగ్ టీమ్ ప్ర‌మోష‌న్స్‌లో వేగం పెంచింది.

ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న‌ ఈ గ్రూప్ ఫోటో ప‌రిశీలిస్తే ఇందులో సోన‌మ్ క‌పూర్‌, క‌రీనా క‌పూర్, స్వ‌రా భాస్క‌ర్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో మెరుపులు మెరిపించారు. పాత స్టైట్ అయినా బుట్ట బ్లౌజు చాలా మోడ్ర‌న్‌గా క‌నిపిస్తోంది. ఫోటోల‌న్నిటినీ వైర‌ల్ భ‌యానీ ఇన్‌స్టాగ్ర‌మ్‌లో పోస్ట్ చేశారు. ఆ ముగ్గురితో క‌లిసి శిఖ త‌ల‌సానియా అనే ఫేజ్ 3 గాళ్ క్యూలో ఉన్నారు. రెక్లెస్ గాళ్స్‌.. ట్రెండీ గాళ్స్‌పై ఇప్ప‌టికే హాలీవుడ్‌లో ఆస‌క్తి రేకెత్తించే సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు వాటి స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది

  •  
  •  
  •  
  •  

Comments