వామ్మో ఇన్ని బూతులా.. వీర్ ది వెడ్డింగ్ ట్రైలర్ రిలీజ్

Wednesday, April 25th, 2018, 09:32:28 PM IST

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు హిందీ చిత్రాలను అంతగా ఆడరించేవాళ్ళు కాదు. కానీ కాలం మారినా కొద్దీ ప్రతీ ఒకొక్కరికీ హిందీ భాషపై ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందిప్రస్తుతం చాలామంది తెలుగు ప్రజలు హిందీ చిత్రాలను కూడా ఆదరిస్తున్నారు. అయితే ఇటివల కరీనాకపూర్, సోనమ్‌కపూర్, స్వరభాస్కర్, శిఖా తస్లానియా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘వీర్ ది వెడ్డింగ్’. శశాంక ఘోష్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రయూనిట్ ముంబైలో గ్రాండ్‌గా రిలీజ్ చేసింది. భిన్న మనస్తత్వాలు కలిగిన నలుగురు స్నేహితులు, ఓ వెడ్డింగ్ ఈవెంట్ చుట్టూ తిరిగే కథాంశంతో..ఫీమేల్ కామెడీ డ్రామా నేపథ్యంలో ఈ మూవీ వస్తుంది. పెళ్లి చేస్కొని రెండేళ్ళ తర్వాత మళ్ళీ సినీ రంగంలోకి అడుగు పెట్టిన కరీనా కపూర్ కొత్త లుక్ తో ఈ చిత్రంలో అలరించనుంది. ఇక తాజాగా సోనం కపూర్ కూడా పెళ్ళికి సిద్దమైన విషయం తెలిసిందే. అయితే ‘వీర్ ది వెడ్డింగ్’చిత్రం జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

  •  
  •  
  •  
  •  

Comments