శ్రీకారం సినిమా పై వెంకయ్య నాయుడు ప్రశంశల వర్షం

Tuesday, March 23rd, 2021, 01:06:09 PM IST

ఈ ఏడాది వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం మాత్రమే కాకుండా, కంటెంట్ తో కూడా ఆకట్టుకుంటున్నారు. అయితే ఇటీవల వచ్చిన సినిమాల్లో శ్రీకారం సినిమా ప్రతి ఒక్కరినీ కూడా ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా పై వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి అనే స్ఫూర్తి ను యువత లో రేకెత్తించే విధంగా తెరకెక్కించిన శ్రీకారం చక్కని చిత్రం అని పేర్కొన్నారు. కుటుంబం, ఊరు అందరూ కలిసి ఉంటే సాధించ లేనిది ఏది లేదనే చక్కనీ సందేశాన్ని అందించిన చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులకు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే అభివృద్ది చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు అందించి, వ్యవసాయం తో జోడించి, పరస్పర సహకారం తో ఆత్మ విశ్వాసం తో అన్నదాత ముందుకు వెళ్ళవచ్చు అన్న సందేశాన్ని శ్రీకారం అందిస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. యువత చూడదగిన చక్కని చిత్రం అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే వెంకయ్య నాయుడు గతంలో సైతం మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే మరొకసారి ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించడం పట్ల చిత్ర యూనిట్ ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు.