ఈ ట్రైలర్ ఎదో చాలా బాగుందే

Sunday, February 12th, 2017, 12:23:34 PM IST


రొటీన్ మాస్ సినిమాలతో బోర్ కొట్టేసే వారికోసం అన్నట్టుగా ఒక సినిమా రాబోతోంది .. పోస్టర్ ల డిజైన్ దగ్గర నుంచీ కూడా ఆకట్టుకున్న ఈ సినిమా హ్యాపీడేస్ లోని టైసన్ హీరోగా తెరకి ఎక్కింది. ఇదివరకు ఈ రోజుల్లో తో పాటు రెండు సినిమాలు నిర్మించిన గుడ్ సినిమా గ్రూప్ వెంకటాపురం సినిమాని నిర్మిస్తోంది. ఒక యంగ్ గర్ల్ మర్డర్ మిస్టరీ ని చేధించే కథ బేస్ గా ఈ సినిమా రాబోతోంది. మహిమా అనే కొత్తమ్మాయి కథానాయికగా పరిచయమవుతోంది. ఈ చిత్ర ట్రైలర్ ను ఈ మధ్యే రిలీజ్ చేశారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్ల తరహాలోనే ఇది కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తోంది.
బీచ్ దగ్గర ఒకమ్మాయి శవం గుర్తుపట్టలేని స్థితిలో కనిపిస్తుంది పోలీసులకు. ఆ అమ్మాయి ఎవరు.. ఆమెను ఎవరు చంపారు అని ఆరా తీస్తే.. తన బాయ్ ఫ్రెండే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులకు తెలుస్తుంది. ఆ బాయ్ ఫ్రెండే రాహుల్. మరి అతను నిజంగానే ఈ హత్య చేశాడా..? అతడి ఉద్దేశమేంటి..? అన్నది మిగతా కథ. ట్రైలర్ చూస్తే సినిమాలో కంటెంట్ ఉన్నట్లే కనిపిస్తోంది.