మరో కుర్ర హీరోతో వెంకటేష్ మల్టి స్టారర్ ?

Tuesday, September 4th, 2018, 10:28:25 PM IST

ఈ మధ్య తెలుగులో మల్టి స్టారర్ సినిమాల హవా బాగా పెరిగింది. ఇప్పటికే పలు మల్టి స్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ మల్టి స్టారర్ సినిమాలకు తెర లేపిన నటుడు వెంకటేష్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్ ఈ మధ్య సోలో హీరోగా కంటే కూడా మల్టి స్టారర్ సినిమాలకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే రామ్, పవన్ కళ్యాణ్ లతో నటించిన అయన తాజాగా మెగా హీరో వరుణ్ తో కలిసి ఎఫ్ 2 లోనటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా తరువాత వెంకీ మరో కుర్ర హీరోతో మల్టి స్టారర్ కు సిద్ధం అయ్యాడు. అయితే ఈ సారి తెలుగు హీరోతో కాదు మలయాళ హీరోతో కలిసి సినిమా చేస్తాడట. ఆ వివరాల్లోకి వెళితే .. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ , వెంకటేష్ లతో ఈ సినిమాకు ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు. తెలుగు, మలయాళ భాషల్లో ఈ సినిమా ఉంటుందని టాక్. ప్రస్తుతం ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

  •  
  •  
  •  
  •  

Comments