గురు’ డు బరిలోకి దిగుతున్నాడు ?

Sunday, September 18th, 2016, 02:50:16 AM IST

venkatesh
ఇతర భాష చిత్రాలను రీమేక్ చేయడంలో వెంకటేష్ తరువాతే ఎవరైనా ..!! ఎందుకంటే .. వెంకటేష్ కెరీర్ లో చేసిన సినిమాల్లో అధికభాగం ఈ రీమేక్ సినిమాలే ఉన్నాయి ? .. సేఫ్ జోన్ లో వెళ్లడం ఆయనకు బాగా ఇష్టం. ఇక ఇటీవలే ”బాబూ బంగారంతో” సోలో హీరోగా వచ్చిన అయన మరో సినిమాను చేయడానికి రెడీ అయ్యాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ”సాలా ఖుద్దూస్” సినిమాను తెలుగులో ”గురు” పేరుతొ రూపొందిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో వెంకటేష్ బాక్సర్ కోచ్ గా కనిపిస్తాడట, ఒరిజినల్ సినిమాలో మాధవన్ నటించాడు. ఇక ఈ సినిమా 19 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తుండగా శశికాంత్ నిర్మిస్తున్నాడు. ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రానా విడుదల చేసాడు. బాక్సింగ్ కోచ్ గా వెంకటేష్ న్యూ లుక్ లో అదరగొట్టాడు, ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పై సూపర్ క్రేజ్ నెలకొంది. మరి గురు డు రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో తెలియాలంటే .. రిలీజ్ వరకు ఆగాల్సిందే?