మరో మల్టీస్టారర్ లో వెంకటేష్!

Saturday, September 1st, 2018, 06:27:35 PM IST

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా వరుసగా మల్టీస్టారర్ కథలు తెరకెక్కుతున్నాయి. స్టార్ హీరోలు మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ – ఎన్టీఆర్ కలయికలో రాజమౌళి భారీ ప్రాజెక్టు ను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున అండ్ నాని కూడా సరికొత్తగా ప్రేక్షకులను అలరించడానికి త్వరలోనే రాబోతున్నారు.

ఇక అందరికంటే ఎక్కువగా వెంకటేష్ మల్టీస్టారర్ కథలను ఒకే చేస్తున్నాడు. ఇప్పటికే వరుణ్ తేజ్ తో F2 సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. ఇక మేనల్లుడు నాగ చైతన్యతో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న వెంకీ నెక్స్ట్ మరో మల్టీస్టారర్ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ తో నటించడానికి వెంకీ ఒప్పుకున్నట్లు టాక్. మహానటి సినిమాలో జెమిని గణేషన్ గా కనిపించిన దుల్కర్ తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యాడు. త్వరలోనే వెంకీతో ఒక కొత్త ప్రాజెక్టును స్టార్ట్ చేసేందుకు ఈ హీరో సిద్దమవుతున్నట్లు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments