అబ్బో వెంకటేష్ .. భలే టైటిల్ పట్టాడే ?

Saturday, October 28th, 2017, 10:18:49 AM IST

గురు సినిమా తరువాత వెంకటేష్ చాల గ్యాప్ తీసుకుని నెక్స్ట్ మూవీ కి ఓకే చెప్పాడు. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కథా చర్చలు జరుపుకున్న ఈ చిత్రానికి సంబందించిన సన్నాహాలు అప్పుడే మొదలయ్యాయి. సురేష్ ప్రొడక్షన్స్, 14 రీల్స్ బ్యానర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశారట!! అయితే టైటిల్ విన్న వారాంత భలే టైటిల్ పట్టాడే వెంకటేష్ అని అంటున్నారు.. ఇంతకి ఆ టైటిల్ ఏమిటో తెలుసా .. ఈ నగరానికి ఏమైంది !!అని .. ఏంటి ఎక్కడో విన్నట్టుంది కదా .. మీరు ఊహించింది నిజమే .. మనం ఏ సినిమాకు వెళ్లినా ముందు వచ్చే క్యాన్సర్ యాడ్ .. మొదట్లో వచ్చే డైలాగ్ అది. ఈ నగరానికి ఏమైంది ..ఓ వైపు అంటూ వచ్చే డైలాగ్ లోని ముందు పదాన్ని పెట్టారట. క్యాచీ గా కూడా ఉంటుందని ప్లాన్ !! ఈ సినిమా నవంబర్ 16న మొదలు కానుందట. ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రిన్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అది విషయం !

  •  
  •  
  •  
  •  

Comments