అజ్ఞాతవాసి లో రివీల్ అయిన వెంకీ రోల్, నెట్ లో వైరల్ !

Thursday, January 11th, 2018, 11:28:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన అజ్ఞాతవాసి చిత్రం నిన్న విడుదలై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది. పవన్ అభిమానులను కొంత నిరుత్సాహపరిచిన ఈ చిత్రం కొద్దిరోజులు గడిస్తే గాని ఏ మేర విజయం సాధిస్తుందో చూడాలి. ఈ సంగతి అలా ఉంచితే, ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ ఒక కామియో రోల్ లో నటిస్తున్నారని, ఈ రోల్ చిత్రం లో చాలా ముఖ్యమైనదని మొదట్లో అన్నారు. చివరకు నిన్న విడుదలైన చిత్రంలో వెంకీ రోల్ కనపడలేదు. ఆ రోల్ కి అంత ఇంపార్టెన్స్ లేక తీసేసారా లేక అసలు వెంకీ ఈ చిత్రం లో నటించారా లేదా అన్న అనుమానాలు సగటు ప్రేక్షకుడికి రాక మానవు, పైగా వెంకటేష్ కి థాంక్స్ చెపుతూ టైటిల్ కార్డ్స్ లో కూడా వేశారు ఇక అసలు విషయానికి వస్తే వెంకటేష్ రోల్ ని ప్రస్తుతానికి త్రివిక్రమ్ పక్కన పెట్టినట్లు, కొద్దిరోజుల తర్వాత కలుపుదామని అనుకున్నారట. అయితే ఇందులో వెంకి ఒక పోలీస్ పాత్రలో ఒక చిన్న మెరుపులా అలా వచ్చి ఇలా వెళతారట. చిత్రం చూసిన వాళ్ళకు ఒక ఫైట్ గుర్తు వుండే ఉంటుంది, హీరోయిన్ అక్కడే వున్నా ఆమెకి తెలియకుండా తనపై ఎటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళని పవన్ సైలెంట్ గా షూట్ చేసి చంపేస్తాడు. ఆ సీన్ ని దర్శకుడు భారతం లోని పాండవుల వ్యవహారం తో ముడిపెట్టి, ఒక ప్రక్కన ఫైట్ జరుగుతుంటే మరో ప్రక్కన పురాణ కాలక్షేపం పెట్టి త్రివిక్రమ్ ఎంత గజిబిజి చేశారో చిత్రం చూసిన వారందరికీ అర్ధం అవుతుంది. ఆయన అభిరుచి మేరకు ఆయన తీశారనుకోండి.

అయితే తర్వాత సీన్ లో వెంకటేష్ పోలీస్ గెటప్ లో వచ్చి ఎవరు చేశారు ఇదంతా అని అడగడం, దానికి పవన్ నేనే సర్ అనడం, వెంటనే వెంకటేష్ నువ్వా , ఎందుకు చేసావ్ ఇదంతా అని అడుగుతాడు. నా మీద ఎటాక్ చేయడానికి వస్తే నేనే చంపేసాను అంటాడు పవన్. నమ్మే లా లేదయ్యా నువ్వు ఇంతమందిని చంపావు అంటే అని అంటాడు వెంకీ. అక్కడితో ఆగకుండా నిన్ను చూస్తుంటే అదేదో చిత్రం లో ‘నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది’ అనే డైలాగ్ చెప్పిన హీరోలాగా కనిపిస్తున్నావు, అతనికి నీకు పోలికలు వున్నాయి అంటాడు. అవునా సార్, నేనూ ఆ సినిమా చూసాను అని ఆ తిక్క డైలాగు ని రిపీట్ చేస్తాడు పవన్. దానికి వెంకీ ఒక కౌంటర్ ఇస్తూ, అబ్బె నువ్వేమి అంత బాగా చెప్పలేదయ్యా, ఆ హీరోనే బాగా చెప్పాడు అని వెళ్లిపోవడం. మొత్తంగా చూసుకుంటే ఇవే అజ్ఞాతవాసి లో వెంకటేష్ నటించిన సన్నివేశాలు అని సమాచారం. నిజానికి ఈ పాత్రని మొదట థర్టీ ఇయర్స్ పృథ్వి తో చేయించాలనుకున్నా ఎందుకో త్రివిక్రమ్ మనసు మార్చుకుని ఫైనల్ గా వెంకటేష్ తో చేయించారు. ఈ సీన్ మొత్తాన్ని అనవసరంగా పక్కన పెట్టారని, ఒకవేళ చిత్రంలో ఈ సీన్ ఉంచి ఉంటే ఫాన్స్ కొంత మేర ఖుషి అయ్యే వారని సినీ విశ్లేషకులు అంటున్నారు…