నిర్మాతగా మారుతున్న… వెంకటేష్?

Thursday, December 29th, 2016, 01:23:31 PM IST

venkatesh
విక్టరీ ని ఇంటిపేరుగా మార్చుకుని హీరోగా వరుస విజయాలు అందుకుంటున్నాడు వెంకటేష్. ఇప్పటికే భిన్నమైన సినిమాలతో స్టార్ డం తెచ్చుకున్న వెంకీ లేటెస్ట్ గా నటిస్తున్న ”గురు” సినిమా జనవరి 26 న విడుదలకు సిద్ధమైంది. హిందీలో సూపర్ హిట్ అయిన ”సాల ఖుద్దూస్” చిత్రానికి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాతో వెంకి మరో కొత్త ప్రయాగానికి సిద్దమయ్యాడు. ఇక టాలీవుడ్ లో హీరోగా 30 ఇయర్స్ పూర్తీ చూసుకున్న వెంకటేష్ .. మరో కొత్త అడుగు వేస్తున్నాడు. ఇంతకి ఆ అడుగు ఏమిటో తెలుసా .. నిర్మాతగా !! అవును ఇప్పటి వరకు వెంకటేష్ తన సొంత సినిమాలు ఎక్కువగా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మాతగా నిర్మించాడు. కానీ వెంకటేష్ తన సొంత సినిమాను అయన సొంత బ్యానర్ లో నిర్మిస్తాడట? లేటెస్ట్ గా పూరి జగన్నాద్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు వెంకటేష్. ఇప్పటికే కథా చర్చలు జరుపుకుంటున్న ఈ సినిమా కథ బాగా నచ్చడంతో వెంకి తన సొంత బ్యానర్లోనే ఈ సినిమాను నిర్మించేందుకు ఓకే అన్నాడట !!
సో త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments