సెట్స్ పైకి వెంకీ – వరుణ్ మల్టి స్టారర్ ?

Sunday, April 15th, 2018, 04:10:36 PM IST


తెలుగులో మరో మల్టి స్టారర్ సినిమాకు రంగం సిద్ధం అయింది. ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ , మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రానికి పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ముహారం కుదిరిగింది. శ్రీ వెంకటేశ్వరా క్రాషన్స్ పతాకం పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ లో సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఈ చిత్రానికి ఎఫ్ 2.. ఫన్ అండ్ ఫ్రాస్ట్రషన్స్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలతో దర్శకుడిగా మంచి హిట్ అందుకున్న అనిల్ తెరకెక్కిస్తున్న మరో ఎంటర్ టైనర్ సినిమా ఇది.