క్రేజీ దర్శకుడికోసం .. వెంకటేష్ వెయిటింగ్?

Saturday, September 8th, 2018, 06:23:04 PM IST

విక్టరీ వెంకటేష్ .. ఈ మధ్య సోలో హీరోగా సినిమాలు చేయడం లేదు. ప్రస్తుతం అయన మల్టి స్టారర్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. తాజాగా వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 సినిమాలో నటిస్తున్న వెంకీ మరో వైపు మరో కుర్ర హీరో దుల్కర్ సల్మాన్ తో కూడా మల్టి స్టారర్ కు ఓకే చెప్పాడు. అయితే ఆయన సోలో హీరోగా కూడా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. కానీ ఆ దర్శకుడితోనే ఆ సోలో సినిమా చేయాలనీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ వెంకటేష్ ఏ దర్శకుడికోసం వెయిటింగ్ లో ఉన్నాడో తెలుసా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ? అవును తన కెరీర్ లోనే సూపర్ హిట్ సినిమాగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు మాటలు రాసి ఆ సినిమా సక్సెస్ లో కీ రోల్ పోషించాడు త్రివిక్రమ్ .. ఇప్పుడు అయన దర్శకుడిగా మారాడు కాబట్టి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి ఇదివరకే వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి కానీ ఆ ప్రాజెక్ట్ పోస్ట్ ఫోన్ అయింది. దాంతో మళ్ళీ ఆ సినిమా చేయాలనీ వెంకీ సన్నాహాలు మొదలు పెట్టాడు. త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేస్తున్నాడు .. ఈ సినిమా పూర్తయ్యాక వెంకీ సినిమా పట్టాలు ఎక్కుతుందో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments