దర్శకుడు బాబీతో కలిసి వెంకీమామ అంటున్న .. చైతు ?

Monday, June 4th, 2018, 11:05:34 PM IST


ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు బాబీ కాస్త గ్యాప్ తీసుకుని ఓ క్రేజీ మల్టి స్టారర్ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. వెంకటేష్ , నాగ చైతన్య హీరోలుగా నటించే ఈ సినిమాకు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తికావొచ్చింది. ఈ సినిమాలో ఈ ఇద్దరు మామ అల్లుళ్ళు కలిసి .. సేమ్ పాత్రలు పోషిస్తున్నారట. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాకు వెంకిమామ అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలయ్యే ఈ సినిమా తమిళనాడు లోని కారైకుడి లో జరపడానికి ప్లాన్ చేసారు. చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా .. వెంకీ సరసన హ్యూమా ఖురేషి ఎంపికైంది. మరి రియల్ లైఫ్ లో వెంకిమామతో చైతు చేసిన అల్లరి .. రీల్ లైఫ్ లో ఉంటుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

  •  
  •  
  •  
  •  

Comments