సీరియస్ గా రంగంలోకి వెంకీ .. ఇంకా బ్రేక్ లేదంతే ?

Saturday, February 24th, 2018, 03:56:03 PM IST

ప్రముఖ నటుడు వెంకటేష్ గురు తరువాత నెక్స్ట్ సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటికే పలువురు దర్శకులతో కథా చర్చలు జరిపిన అయన ఫైనల్ గా తేజ కు ఓకే చెప్పాడు. తేజ దర్శకత్వంలో కొత్తవాళ్లను పరిచయం చేస్తూ వెంకటేష్ చేసే ఈ సినిమా మార్చ్ 12 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ కావొచ్చాయని, అందుకే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారట. ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ చేయాలని వెంకీ ప్లాన్ చేసాడట. ఈ సినిమాను త్వరగా పూరి చేసి ఆ తరువాత వెంటనే మరో సినిమాను చేస్తాడట. దానికి తగ్గట్టుగా దర్శకుడు తేజ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఆటా నాదే .. వేట నాదే అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అన్నట్టు ఈ సినిమా తరువాత వెంకీ .. అనిల్ రావిపూడితో సినిమా చేస్తాడట. మరో వైపు తేజ కూడా ఎన్టీఆర్ బయోపిక్ చేయనున్నాడు.