రోడ్డు పైన ఆటలాడుతూ కెమెరాకి చిక్కిన వెంకి..

Tuesday, May 8th, 2018, 11:13:26 AM IST

విక్ట‌రీ వెంకటేష్‌కి సినిమాల‌తో పాటు క్రీడ‌లంటే కూడా చాలా ఇష్టం. ఎక్కువ‌గా క్రికెట్ ప్రేమికుడిగా సినీ అభిమానులకి, క్రికెట్ అభిమానులకి సుప‌రిచితం. ఎప్పుడో ఏదో ఒక క్రికెట్ పోటీల్లో కనిపిస్తూ అందరినీ అలరిస్తూ ఉంటాడు. ఎన్ని సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా క్రీడలు అంటే మాత్రం కచ్చితండా సమయం కేటాయిస్తాడు. ఇటీవ‌ల జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచుల‌లో గ్యాల‌రీలో కూర్చొని సంద‌డి చేస్తున్న వెంకీ రీసెంట్‌గా చిన్నారుల‌తో క‌లిసి రోడ్‌పైన ష‌టిల్ ఆడారు. ఈ వీడియోని వెంకీ అభిమానులు సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌ల్ అయింది. అటుగా వెళుతున్న వెంకీ స‌డెన్‌గా కారు దిగి వారితో ఆడ‌టంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ కూడా గ‌ల్లీబాయ్స్‌తో క్రికెట్ ఆడిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది గురు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన వెంక‌టేష్ త్వ‌ర‌లో ఎఫ్‌2 చిత్ర టీంతో క‌లిసి ప‌ని చేయ‌నున్నాడు. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీస్టార‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ కూడా ముఖ్య పాత్ర పోషించ‌నున్నాడు. మ‌రో వైపు వెంకీ .. తేజ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఎప్పుడో మొద‌లు కావ‌ల‌సిన ఈ సినిమా ప‌లుకార‌ణాల వ‌ల‌న ఆగిపోయింది.

Comments