భరత్ అనే నేను సూపర్ అంటున్న వెంకీ!

Thursday, April 26th, 2018, 06:20:51 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ భరత్ అనే నేను. విడుదలయిన తొలి రోజునుండి ఈ చిత్రం అద్భుతమైన పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ చిత్రంలో నటనకు గాను ఇప్పటికే పలువురు మహేష్ బాబును, అలానే అద్భుతంగా చిత్రాన్ని తీసిన కొరటాల ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అలా అభినందించే వారి లిస్ట్ లో నేడు విక్టరీ వెంకటేష్ కూడా చేరారు. నిజానికి సోషల్ మీడియాలో పెద్దగా ఆక్టివ్ గా ఉందని ఆయన నేడు తన సోషల్ మీడియా మాధ్యమం పేస్ బుక్ లో ఒక పోస్ట్ చేశారు.

తాను నిన్ననే భరత్ అనే నేను చూశానని, సెన్సిటివ్ పాయింట్ ని కొరటాల చాలా అద్భుతంగా తెరకేక్కిన్చాడని, పోతే మహేష్ బాబు నటనే సినిమా స్థాయిని మరింత పెంచిందని అన్నాడు. చిత్రాన్ని నిర్మించిన దానయ్యకు, అలానే మొత్తం టీం మెంబెర్స్ అందరికి శుభాకాంక్షలు తెలియచేసాడు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం దాదాపు మొత్తంగా అన్నిఏరియాలు కలిపి రూ.74 కోట్ల షేర్ వసూలు చేసిదూసుకుపోతోంది. ప్రస్తుతానికి నాపేరు సూర్య విడుదలవరకు పెద్ద సినిమాలు ఏమి లేవు కాబట్టి మహేష్ బాబు కలెక్షన్ల సునామీకి మరికొద్దిరోజులపాటు పెద్దగా అడ్డు ఏది ఉండబోదని తెలుస్తోంది. అలానే ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం ప్రస్తుతం 2.5 మిలియన్ల దాటి 3 మిలియన్ల వైపు దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది…..

  •  
  •  
  •  
  •  

Comments