వెంకీ- తేజ లాంచింగ్ డే ఇదే..

Sunday, December 3rd, 2017, 07:49:58 PM IST

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించే సినిమా ఈ సోమ‌వారం రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభం కానుంది. ఆ మేర‌కు ఠెంకాయ కార్య‌క్ర‌మానికి ప‌క్కాగా ప్రిపరేష‌న్స్ సాగుతున్నాయ‌ని తెలిసింది. వాస్త‌వానికి ఈనెల 13న వెంకీ పుట్టిన‌రోజు వేళ ఈ సినిమా లాంచింగ్ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని తొలుత వార్త‌లొచ్చినా అందులో ఏ నిజం లేద‌ని తెలుస్తోంది. `గురు` త‌ర్వాత వెంక‌టేష్‌కి, `నేనే రాజు నేనే మంత్రి` త‌ర్వాత తేజ‌కి ఈ సినిమా మ‌రో బూస్ట‌ర్ లాంటిది. ఆ ఇద్ద‌రికి మ‌రో హిట్టు ద‌క్కితే కెరీర్ ప‌రంగా మ‌రో లెవ‌ల్ సాధ్య‌ప‌డుతుంది. ఇటీవ‌లి కాలంలో వెంకీ ఎందుక‌నో సినిమాలు త‌గ్గించారు. రిలాక్స్‌డ్‌గా ఉంటున్నారు. త‌న ఇమేజ్‌కి స‌రిప‌డే, న‌వ్య‌పంథా స్క్రిప్టులేవీ త‌న‌వైపు రాక‌పోవ‌డంతో విక్ట‌రీ ఓకే చెప్ప‌డం లేదు. ఈసారి తేజ అత‌డిని ఓ సైంటిస్టుగా చూపించేందుకు రెడీ అవుతుండ‌డంతో ఓకే చెప్పేశాడు. ఇక నేను రాజు నేనే మంత్రి చిత్రంతో తేజ తానేంటో నిరూపించుకుని ఈ సినిమా చేస్తున్నాడు కాబ‌ట్టి పెద్ద స్థాయిలోనే అంచ‌నాలున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments