ట్రైల‌ర్ టాక్‌ : వికృత ప్ర‌యోగం విక‌టిస్తే..?! దేవుడోయ్‌!!?

Tuesday, April 24th, 2018, 10:06:44 PM IST

సైన్స్ ఫిక్ష‌న్ సినిమాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త జోన‌ర్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. సూప‌ర్‌హీరో సిరీస్‌ల‌ను ఫిక్ష‌న్ జోడిస్తూ అల్లాడిస్తున్న‌ట్టే సైన్స్ ఫిక్ష‌న్‌లోనూ ప్రిడేట‌ర్, మెన్ ఇన్ బ్లాక్, స్పీసీస్‌ లాంటి అద్భుత ప్ర‌యోగాల్ని హాలీవుడ్‌లో చేశారు. ఇవ‌న్నీ మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ మూవీస్‌. అయితే అదే కేట‌గిరీలో వేరొక సైన్స్ ఫిక్ష‌న్ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. `వీన‌మ్‌` అనేది ఈ సినిమా టైటిల్‌. మార్వ‌ల్ సంస్థ నిర్మించిన ఈ సినిమాని సోని సంస్థ ఇండియాలో రిలీజ్ చేస్తోంది.

తాజాగా ఈ భారీ సినిమా ట్రైల‌ర్ రిలీజైంది. మైండ్ బ్లోయింగ్ అనిపించే యాక్ష‌న్‌తో వీన‌మ్ అద‌ర‌గొడుతోంది. అక్టోబ‌ర్ 5న ఈ సినిమా రిలీజ‌వుతోంది. ఆస్కార్ నామినేటెడ్ న‌టుడు టామ్ హార్డీ కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రంలో లెద‌ల్ ప్రొటెక్ట‌ర్ వీన‌మ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. సైన్స్, ల్యాబ్ ప్ర‌యోగాలు.. వాటిలో ప్ర‌యోగం విక‌టిస్తే క‌లిగే ప‌ర్య‌వ‌సానాలు ఇవ‌న్నీ సినిమాలో చూపిస్తున్నారు. ప్ర‌యోగం విక‌టించాక హీరోలోకి ప్ర‌వేశించే మృగం ఎలాంటి భీభ‌త్సం సృష్టించింది? అన్న కాన్సెప్ట్ ఆద్యంతం క్యూరియాసిటీ పెంచుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments