ఒక మీడియా అధినేత చనిపోవచ్చు..! వేణు స్వామి సంచలన నిజాలు

Wednesday, June 12th, 2019, 01:04:06 PM IST

వేణుస్వామి ఈ పేరు చాలా మందికి పరిచయం ఉన్న పేరు..సెలెబ్రటీస్ యొక్క జాతకాలను చెపుతూ,రాజకీయనాయకులకు మహామహా యాగాలు చేస్తూ మంచి పాపులర్ అయ్యాడు..అయన ఏమి మాట్లాడిన ఒక సంచలనంగా మారిపోతుంది..యూట్యూబ్ లో ఆయనకి సంబంధించి ఎన్నో వీడియోస్ హల్ చల్ చేస్తున్నాయి. గతంలో జగన్ సీఎం అవుతాడని చెప్పాడు, ఆ తర్వాత 2019 లో బాలకృష్ణ ఎక్కడ నుండి పోటీచేసిన గెలుస్తాడని ఘంటాపధంగా చెప్పిన ఒకే ఒక్క సిద్ధాంతి వేణు స్వామి..

అయన తాజాగా మరో సంచలనమైన విషయాలు చెప్పుకొచ్చాడు.. అదేమిటంటే రాబోవు కొన్ని రోజుల్లో ఒక మీడియా అధినేత చనిపోవటం ఖాయమంటూ చెప్పుకొచ్చాడు. అలాగే మరో ఇద్దరు మగ జర్నలిస్టులు జైలు పాలయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.. అలాగే గరుడ పురాణం చెప్పిన వ్యక్తి కూడా జైలుకి వెళ్లే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.. ప్రస్తుతం జరుగుతున్నా పరిస్థితులను బట్టి చుస్తే వేణు స్వామి టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ ని దృష్టిలో పెట్టుకొని కామెంట్స్ చేశాడని అర్ధం అవుతుంది.. అయితే రవి ప్రకాష్ సీఈఓ మాత్రమే కానీ మీడియా అధినేత కాదు.. మరి వేణు స్వామి చెప్పుతున్నట్లు చనిపోయే మీడియా అధినేత ఎవరు అనేది ఇప్పుడు బాగా చర్చనీయాంశం అవుతుంది. అలాగే గరుడ పురాణం వ్యక్తి అంటే సినీ నటులు శివాజీ కూడా జైలు కి వెళ్లే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు..

ప్రస్తుతం జరుగుతున్నా పరిస్థితులను గమనిస్తే మరి కొద్దీ రోజుల్లో రవి ప్రకాష్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..రవి ప్రకాష్ అరెస్ట్ కి సంబంధించి ఇరు వర్గాలు వాదోపవాదనలు వేడి వేడి గా జరుగుతున్నాయి..మరో పక్క సినీ నటుడు శివాజీ ఇండియా వదిలిపెట్టి శ్రీలంక వెళ్లి అక్కడ తల దాచుకుంటూ,అక్కడ క్యాసినో లో సేద తీరుతున్నట్లు తెలుస్తుంది..రవి ప్రకాష్ అరెస్ట్ అయిన తర్వాత పోలీసుల టార్గెట్ శివాజీ అని తెలుస్తుంది.. నిజానికి గతంలోనే వేణు స్వామి మాట్లాడుతూ 2019 లో మీడియాకి చిక్కులు తప్పవు అంటూ చెప్పాడు.. ప్రస్తుతం మనం గమనిస్తే మీడియా విషయంలో అలాగే జరుగుతుంది..