తార‌క్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్!

Monday, September 10th, 2018, 12:53:33 PM IST

యంగ్ య‌మ‌ ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ మూవీ `అర‌వింద స‌మేత‌` ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. తండ్రి మ‌ర‌ణానంత‌రం ద‌శ‌దిన క‌ర్మ‌లు పూర్తి చేసుకుని తార‌క్ సెట్స్ కి ఎటెండ్ అవుతున్నాడు. మ‌ధ్య‌లో మూడు రోజుల గ్యాప్ మాత్ర‌మే ఇచ్చాడు. అంత బాధ‌లోనూ నిర్మాత క‌ష్టం గురించి ఎరిగిన వాడిగా అత‌డు యూనిట్ కి స‌హ‌క‌రిస్తూ తిరిగి సెట్స్‌కి వ‌చ్చేశాడు. ఈ సినిమా టీజ‌ర్ ఇదివ‌ర‌కూ రిలీజై సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఈ వినాయ‌క చ‌వితికి ఎన్టీఆర్ మాస్ అప్పీల్‌కి సంబంధించిన వేరొక టీజ‌ర్‌ని రిలీజ్ చేస్తార‌ని అభిమానులు భావించారు. అందుకు త‌గ్గ‌ట్టే `బంప‌ర్ స్టంప్` రిలీజ్ చేస్తున్నామ‌ని యూనిట్ ప్ర‌క‌టించింది. సెప్టెంబ‌ర్ 13 న బంప‌ర్ స్టంప్ వ‌స్తుంద‌ని చెప్ప‌గానే, అంతా ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ నెల 13న బంప‌ర్ స్టంప్ కానుక‌ను ఇవ్వాల‌నే అనుకున్నా.. ఇప్పుడు ఆ ఆలోచ‌న విర‌మించుకున్నార‌ని తెలుస్తోంది.

తార‌క్ ఇంకా ఆ బాధ‌లోంచి కోలుకోలేదు. ఇలాంట‌ప్పుడు ఈ ప్ర‌చారం బావుండ‌ద‌ని రాధాకృష్ణ & టీమ్ భావించార‌ట‌. తార‌క్ త‌ర‌పు నుంచి ఆలోచించి ఈ వాయిదా త‌ప్ప‌డం లేద‌ని తెలుస్తోంది. దీంతో మ‌రో మూడు రోజుల్లో త‌మ‌కు ట్రీట్ ద‌క్కుతుంద‌ని భావించిన ఫ్యాన్స్‌కి నిరాశ త‌ప్పేట్టు లేదు. వాయిదా విష‌యాన్ని టీమ్ అధికారికంగా ధృవీక‌రిచాల్సి ఉందింకా.

  •  
  •  
  •  
  •  

Comments