బిగ్ వైరల్: కరోనాతో చనిపోయిన వారి శవాలను ఎలా ఈడ్చి పారేస్తున్నారంటే?

Wednesday, July 1st, 2020, 02:42:43 AM IST


దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉదృత్తి పెరిగిపోతుంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండగా, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. అయితే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు తిరిగి లాక్‌డౌన్ విధించుకునేందుకే ఎక్కువ సుముఖత చూపుతున్నాయి.

అయితే తాజాగా కర్నాటకలోని బళ్ళారిలో కరోనాతో చనిపోయిన మృతదేహాల పట్ల వైద్య సిబ్బంది సంస్కారహీనంగా ప్రవర్తించారు. 7గురి కరోనా శవాలను ఈడ్చుకు వచ్చి ఒకే గుంతలో పడేసి జేసీబీతో మట్టిని తోసి కప్పెట్టేశారు. అయితే ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ నకుల్ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, తిరిగి ఇలాంటి సంఘటననలు జరగకుండా చూసుకుంటామని తెలిపారు.