ఈమె అమ్మాయి కాదు ఆటంబాంబ్

Friday, December 30th, 2016, 03:09:07 PM IST

sri
శ్రీలక్ష్మి సతీష్ అనే యువతి కేరళలోని ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సీఈఓ, మోటివేషన్ స్పీకర్ గా పని చేస్తుంది. ఆమెకు ఈ మధ్య ఫేక్ కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయి. ‘నన్ను ఎప్పుడు రమ్మంటావ్.?’, ‘నీ రేట్ ఎంత..?’ ‘3000 సరిపోతాయా..?’, ‘హోటల్ లో రూమ్ బుక్ చేయనా..? ఇలాంటి కాల్స్ ఆ యువతికి వస్తున్నాయి. ఇంకొకడు 25000/- ఇస్తాను రమ్మంటూ వేధించడం మొదలుపెట్టాడు. రోజురోజుకూ ఇలాంటి కాల్స్, మెసేజ్ లు ఎక్కువ కావడంతో విసుగు చెందిన ఆమె మొదట ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు.

అయితే అంతలోనే మళ్ళీ ధైర్యం తెచ్చుకుని తనకు ఫోన్ చేసిన వాళ్లలో ఒకడి నెంబర్ కి కాల్ చేసి తాను ఎవరో, ఏం చేస్తుంటుందో చెప్పేసరికి అవతలి వాడికి చెమటలు పట్టేసాయి. ఆమెను క్షమించమని వేడుకున్నాడు. వాట్సాప్ గ్రూప్ లోని సంభాషణల ద్వారా ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన వ్యక్తిని ఆమె కనుక్కోగలిగింది. ఆ సంభాషణల స్క్రీన్ షాట్ ఫోటోను ఆమె సంపాదించారు. తన ఫోన్ నెంబర్ ను పోస్ట్ వ్యక్తి ఒక జాతీయ రాజకీయ పార్టీ యువజన నాయకుడిగా ఆమె తెలుసుకుంది. వెంటనే ఆమె పోలీసులకు రిపోర్ట్ ఇవ్వాలనుకుంది. అయితే ఆ యువకుడి తండ్రి కేసు పెట్టొద్దని వేడుకున్నాడు. పార్టీ కార్యకర్తలు కూడా ఆమెకు ఫోన్ చేసి బ్రతిమాలుతూ… బయట రాజీ చేసుకుందామని చెప్పారు. ఆమె కూడా సరేనని అన్నారు. అయితే ఏదైనా స్వచ్చంద సేవ సంస్థకు 25000 రూపాయలు విరాళం ఇచ్చి ఆ రశీదును తనకు అప్పగించాలని ఆమె చెప్పింది. వాళ్ళు కూడా అందుకు అంగీకరించి 25000 రూపాయలు విరాళం ఇచ్చి రశీదును ఆమెకు ఇచ్చారు. అయినా ఆమె కోపం మాత్రం చల్లారలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని పేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కు విపరీతమైన స్పందన వస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments