వీఎఫ్ఎక్స్ మాయాజాలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా విజువల్స్ రూపురేఖల్ని అమాంతం మార్చేసే ఈ టెక్నిక్ మహదాద్భుతమైనది. అసలు డిజిటల్ కెమెరాల్లో షూట్ చేసిన విజువల్స్ డే లైట్లో చాలా సాధాసీధాగా కనిపిస్తాయి. కానీ వాటిని వీఎఫ్ఎక్స్లో రీడిజైన్ చేశాక అద్భుతంగా కనిపిస్తాయి. ఇదిగో `భాఘి 2` క్లైమాక్స్ ఫైట్ కోసం సీజీ, వీఎఫ్ఎక్స్లో ఎలాంటి మార్పులు చేశారో .. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలే చెబుతున్నాయి.
కొండల్లో, పర్వతాల్లో హెలీకాఫ్టర్ ఛేజ్ ఫైట్ భాఘి 2 క్లైమాక్స్‌లో వస్తుంది. అది సినిమాకే హైలైట్‌గా నిలిచిందన్న టాక్ వచ్చింది. అయితే దీనివెనక ప్రైమ్ ఫోకస్ వీఎఫ్ఎక్స్ టీమ్ అసాధారణ ప్రతిభ, పనితనం దాగి ఉంది. హెలీకాఫ్టర్ కుప్పకూలేప్పుడు స్పార్క్ రావడం, స్మాగ్ ఎఫెక్ట్, టాప్‌లో హెలీకాఫ్టర్ రెక్కలు మెరుపు వేగంతో తిరగడం ఇవన్నీ ఎఫెక్టులే. నిజానికి ఆన్ లొకేషన్ ఓ డమ్మీ హెలీకాఫ్టర్ని ఉపయోగించినా, అది ఒరిజినల్ హెలీకాఫ్టర్లా కనిపించేలా వీఎఫ్ఎక్స్, సీజీలో మ్యానేజ్ చేస్తారు. అంతేకాదు, అక్కడ కొండలపై పచ్చని చెట్లు, వాతావరణం కనిపించేలా ఈ టెక్నిక్‌ని ఉపయోగించారు. ఎంతో డ్రైగా ఉండే లొకేషన్ని అంత అద్భుతంగా మార్చేసింది సంకేతికత.. దీని వెనక ఎంతో శ్రమ దాగి ఉందని ప్రైమ్ ఫోకస్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ మహేష్ బారియా తెలిపారు.