బాలీవుడ్ పాపులర్ కంపెనీ చేతికి దేవదాస్ హక్కులు ?

Friday, September 14th, 2018, 02:49:27 PM IST

అక్కినేని నాగార్జున, నాని హీరోలుగా నటిస్తున్న మల్టి స్టారర్ దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. నాగార్జున డాన్ గా దేవ్ అనే పాత్రలో నటిస్తుండగా .. నాని దాస్ గా డాక్టర్ గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ కంపెనీ వయాకామ్ 18 సొంతం చేసుకుంది. తెలుగు సినిమాలను మార్కెట్ చేసే విషయంలో ఇప్పటికే పలు బాలీవుడ్ కంపెనీలు వస్తున్నా విషయం తెలిసిందే . ఇప్పటికే రిలయన్స్, టి సిరీస్, యాష్ రాజ్ ఫిలిమ్స్, ధర్మ ప్రొడక్షన్ లాంటి పాపులర్ బ్యానర్స్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి . తాజాగా మరో పాపులర్ కంపెనీ వయాకామ్ 18 టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ కంపెనీ ఈ సినిమా తెలుగు హక్కులను భారీ అఫర్ తో దక్కించుకోవడం విశేషం.

  •  
  •  
  •  
  •  

Comments