సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్న ఉప రాష్ట్రపతి…

Saturday, December 14th, 2019, 06:31:16 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పై మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మనదేశ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు. కాగా మహిళలపై జరుగుతున్నటువంటి దాడులని అరికట్టేందుకు రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి దిశ చట్టం అమలులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో సీఎం జగన్ ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఈమేరకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోషల్ మీడియా ద్వారా తన అభినందనలను తెలియజేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి లైంగిక పరమైన వేధింపులపై సమగ్ర విచారణ జరిపించి, తొందర్లోనే నిందితులకు శిక్ష పడేలా చర్య తీసుకునేలా చట్టాన్ని చేయడం అభినందనీయం అని వాఖ్యానించారు.

కాగా ఈ చట్టం అమలైతే అత్యాచార బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతందని, ఇకపోతే రాష్ట్రంలో ఇలాంటి చర్యలు తగ్గుముఖం పడతాయని వెల్లడించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశ ఘటన ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చట్టాన్ని చేశారని, ఇలాగె అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి దిశ చట్టాలు చేయాలనీ, మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.