వెంకీ డాట‌ర్ ల‌వ్ మ్యారేజ్‌

Saturday, September 22nd, 2018, 09:19:09 AM IST


విక్ట‌రీ వెంక‌టేష్ కుమార్తె అశ్రిత ప్రేమ వివాహం చేసుకోనున్నార‌ని తెలుస్తోంది. కాబోయే వ‌రుడు మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు ర‌ఘురామి రెడ్డి కుమారుడు, సురేంద‌ర్ రెడ్డి మ‌న‌వ‌డు అని స‌మ‌చారం. ఈ వివాహానికి సంబంధించి ఇరు కుటుంబాల పెద్దలు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని ఫిలింన‌గ‌ర్ వార్తాహ‌రుల ఇన్ఫ‌ర్మేష‌న్.

అమ్మాయి – అబ్బాయి చాలా కాలంగా స్నేహితులు. ఇటీవ‌లే త‌మ ప్రేమ వ్య‌వ‌హారాన్ని కుటుంబ స‌భ్యుల‌కు చెప్పార‌ట‌. ఆ త‌ర్వాత అశ్రిత పెద‌నాన్న నిర్మాత‌ డి.సురేష్‌బాబు అబ్బాయి ఇంటికి వెళ్లి పెద్ద‌లతో మాట‌లు సాగించార‌ట‌. ప్ర‌స్తుతం ప్రేగ్ దేశంలో `ఎఫ్‌2` షూటింగులో ఉన్న వెంకీ తొంద‌ర్లోనే హైద‌రాబాద్‌కి విచ్చేస్తున్నారు. వెంకీ రాగానే అశ్రిత నిశ్చితార్థం జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. ఇక వ‌రుడి తాత‌గారు ఆర్‌.సురేంద‌ర్ రెడ్డి హైద‌రాబాద్ రేస్ క్ల‌బ్ ఛైర్మ‌న్‌గా సుప్ర‌సిద్ధులు. ఇరు కుటుంబాలు భారీ ఎత్తున ఈ వివాహ వేడుక‌కు ప్లాన్ చేస్తున్నాయ‌ని తెలుస్తోంది.