మేకింగ్ వీడియో : అజ్ఞాతవాసి వెంకీ వచ్చాడు.. కానీ?

Friday, January 12th, 2018, 02:55:50 PM IST

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా బుధవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ని బాగానే అందుకుంది. ఇక సెలవుల రోజుల్లో ఎలా ఉంటుందో గాని ప్రస్తుతం సినిమాకు సంబందించిన ఒక వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అజ్ఞాతవాసి సినిమాలో విక్టరీ వెంకటేష్ కామియో రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి కానుకగా సినిమాలో ఆ సిన్ ను యాడ్ చేయనున్నారట. రీసెంట్ గా హారికా హాసిని క్రియేషన్స్ వారు అందుకు సంబందించిన డబ్బింగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. వెంకటేష్ – పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెబుతూ సరదాగా మాట్లాడుకోవడం అందరిని ఆకర్షించింది. మరి ఈ వీడియో మిక్స్ చేయడం వల్ల సినిమాకు ఏమైనా లాభం చేకూరుతుందో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments