వీడియో : ఖిల్జీ తెర‌వెన‌క క‌థ‌

Friday, April 13th, 2018, 11:21:34 PM IST

`ప‌ద్మావ‌త్ 3డి` స‌క్సెస్‌లో ఖిల్జీ పాత్ర‌ధారి ర‌ణ‌వీర్ సింగ్ ను అస్స‌లు విస్మ‌రించ‌లేం. ఆ పాత్ర‌లోని ఎన‌ర్జీ సినిమాకి జీవం పోసింది. పద్మావ‌త్ పాత్ర‌లో దీపిక ప‌దుకొన్ ఎంత‌గా జీవించిందో, అంత‌కుమించి ఖిల్జీ పాత్ర‌లో ర‌ణ‌వీర్ జీవించాడు. ఇక షాహిద్ రాజా ర‌త‌న్ సింగ్ పాత్ర‌లో అంతే హుందాగా న‌టించాడు. అందుకే ప‌ద్మావ‌త్ 3డి అంత పెద్ద హిట్ట‌యింది.

లేటెస్టుగా ఈ సినిమాలో ఖిల్జీ పాత్ర తెర‌వెన‌క క‌థ‌ను ఆవిష్క‌రిస్తూ వీడియోని లాంచ్ చేశారు. ఖిల్జీ మేక‌ప్ .. అత‌డిని ప్రిపేర్ చేసిన విధానంపై వీడియో అబ్బుర‌ప‌రుస్తోంది. ఇక ఈ వీడియోకి బ్యాక్‌గ్రౌండ్‌లో ర‌ణ‌వీర్ సింగ్ వాయిస్ వినిపించాడు. ఒక పాత్ర కోసం ఓ న‌టుడు ఎంత‌గా త‌పిస్తాడో ఈ వీడియోనే ఎగ్జాంపుల్‌. త‌దుప‌రి ర‌ణ‌వీర్ సింబా (టెంప‌ర్ రీమేక్‌) పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. క్రికెట్ లెజెండ్‌ క‌పిల్ దేవ్ పాత్ర‌తోనూ మెప్పించేందుకు త్వ‌ర‌లో రానున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments