పాక్ లో ప్రమాదం : ప్రమాదానికి గురైన విమానం – బయటపడ్డ వీడియో…

Saturday, May 23rd, 2020, 11:28:39 AM IST

పాకిస్థాన్ కి చెందిన ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒకటి కుప్పకూలిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ ఘటనలో దాదాపుగా 92 మంది మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే… కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉన్న మోడల్ కాలనీలో శుక్రవారం విమానం కూలింది. కాగా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఒక సీసీటీవీ వీడియో ఫుటేజ్ విడుదలైంది. కాగా విమానం కూలిన ప్రాంతంలో ఒక ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకున్నటువంటి సీసీటీవీ కెమెరాలకు ఈ విమాన ప్రమాదానికి సంబందించిన ఫుటేజీ రికార్డయినట్లు తెలుస్తుంది.

కాగా ఆ వీడియో లో గాలిలో ఎగురుతున్న విమానం కాస్త బిల్డింగ్‌లపై కూలుతున్నట్లు ఆ వీడియోలో బందించబడింది. అంతేకాకుండా ఆ విమానం లాండింగ్ సమయంలోనే ఇళ్లపై కూలిపోయినట్లు కనబడుతుంది. ఇకపోతే ప్రమాదానికి ముందు పైలట్‌.. ఏటీసీ అధికారులతో సంప్రదించి, విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు వెల్లడించారని సమాచారం. కాగా ఈ ప్రమాదంలో విమానంలో 91 మంది ప్యాసింజెర్లు, 8 మంది సిబ్బంది ఉండగా, దాంట్లో 19 మందిని ఇప్పటి వరకు గుర్తించారు. కేవలం ఇద్దరు మాత్రమే ఈ ప్రమాదం నుండి భయపడ్డట్లు వెల్లడించారు.