వీడియో సాంగ్ ప్రోమో : ఓ వసుమతి (భరత్ అనే నేను)

Friday, April 13th, 2018, 06:23:59 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కైరా అద్వానీ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న నూతన చిత్రం భరత్ అనే నేను. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా ట్రైలర్ అలానే పాటలు జనాలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఆడియో లోని భరత్ అనే నేను పాత, వచ్చాడయ్యో సామి, వసుమతి, ఇది కలలా వున్నదే పాటలు ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ లుగా నిలిచాయి. యూట్యూబ్ లో ఓవైపు ట్రైలర్ దుమ్ములేపుతుండగా, మరోవైపు పాటలు కూడా మంచి వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. అయితే నేడు ఈ చిత్ర యూనిట్ తొలిసారి ఓ వసుమతి పాట తాలూకు వీడియో ప్రోమో ని విడుదల చేసింది. ప్రస్తుతం విడుదలయిన ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో మహేష్ బాబు స్టైల్, కాస్ట్యూమ్స్, పాటలో వేసిన సెట్టింగ్ నిజంగా అదిరిపోయాయి అనే చెప్పాలి. మహేష్ కైరా అద్వానీ ల జంట కూడా ఒకరికొకరు సరిపోయారని పాట చూసిన పలువురు నెటిజన్లు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా క్రింద ఇచ్చిన లింక్ లో ఆ పాట చూసేయండి…..

  •  
  •  
  •  
  •  

Comments