వీడియో : అదరగొడుతున్న “వచ్చాడయ్యో సామి” సాంగ్ ప్రోమో

Tuesday, April 17th, 2018, 06:22:22 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న కొత్త సినిమా భరత్ అనే నేను ఆడియో ఇటీవల విడుదలయి సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అందులో మరీ ముఖ్యంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రతి ఒక్కపాటని అద్భుతంగా కంపోజ్ చేసారని చెప్పాలి. ప్రతిఒక్కపాట దేనికదే సూపర్బ్ గా వున్నాయి. భరత్ అనే నేను టైటిల్ సాంగ్ తో పాటు ఈ ఆల్బం లో వచ్చాడయ్యో సామి పాట శ్రోతలనుండి మంచి రెస్పాన్స్ సాధించింది. అందులో మహేష్ బాబు పంచెకట్టుతో నటించినట్లు తెలుస్తోంది. అయితే నేడు సినిమా యూనిట్ ఆ పాట వీడియో సాంగ్ ప్రోమో ను యూట్యూబ్ లో విడుదల చేసింది.

విడుదలయినప్పటినుండి ఈ సాంగ్ మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. సాంగ్ చూసిన ప్రతిఒక్కరు మహేష్ బాబును చూడటానికి రెండుకళ్ళూ చాలవని, మరీ ముఖ్యంగా ఆయన్ని చూస్తుంటే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారిని చూస్తున్నట్లు ఉందని అభిప్రాయపడుతున్నారు. నైట్ ఎఫెక్ట్ లో తీసిన ఆ పాట సినిమాలో కన్నులపండుగగా ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. కాగా ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే…..