వీడియో : ‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్ లో విష్ణు గాయపడిన ఘటన!

Wednesday, April 25th, 2018, 10:22:55 AM IST

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర అనే సినిమాలో నటించారు. అయితే కొద్దిరోజుల క్రితం అమెరికా లో ఈ సినిమాలో ఒక ఛేజింగ్ సీన్ తీస్తున్న సమయంలో విష్ణు గాయాలపాలయిన విషయం తెలిసిందే. స్టంట్ లు చేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టం అనే విషయం ఈ సంఘటనతో తెలిసివచ్చింది విష్ణు అన్నారు. ఆయన జరిగిన ప్రమాద ఘటన తాలూకు వీడియోని సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.

అందులో ఆయన స్టంట్ చేయబోయి బండి స్లిప్ అయి కిందపడ్డారు. ఆ సమయంలో నా చేతికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరకంగా నా తలకు కూడా దెబ్బ తగలవలసింది. కానీ అదృష్టవశాత్తు తప్పించుకున్నాను అన్నారు. ఆ తరువాత ఆయన కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకుని తిరిగి షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. కాగా ఈ సినిమాలో ఆయనకు జోడిగా ప్రగ్య జైస్వాల్ నటిస్తుండగా, ప్రధాన పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నారు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాకి జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది….

  •  
  •  
  •  
  •  

Comments