ఇందిరాగాంధీ పాత్ర‌లో విద్యాబాల‌న్

Wednesday, January 10th, 2018, 11:01:44 PM IST

ప‌రిణీత నుంచి తుమ్హారీ షులూ వ‌ర‌కూ విద్యాబాల‌న్ జ‌ర్నీ ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. బాల‌న్ కెరీర్‌లో డ‌ర్టీపిక్చ‌ర్‌లాంటి ప్ర‌త్యేక‌మైన సినిమా ఉంది. వంద కోట్ల నాయిక‌గా త‌న‌ని తాను బాల‌న్ ఆవిష్క‌రించుకున్న తీరు ఎంతో ఇంట్రెస్టింగ్‌. ఇటీవ‌లే తుమ్హారీ షులూ చిత్రంలో ఇల్లాలుగా.. అద‌ర‌గొట్టేసింది.

ఈసారి అంత‌కుమించి కొత్త‌గా క‌నిపించనుంద‌ని తెలుస్తోంది. విద్యాబాల‌న్ ఈసారి ఇండియాస్ మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరాగాంధీ పాత్ర‌లో న‌టించ‌నుంది. ఆ మేర‌కు జ‌ర్న‌లిస్టు సాగ‌రికా ఘోష్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. సాగ‌రిక ర‌చ‌న `ఇందిరా: ఇండియాస్ మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ ప్రైమ్ మినిస్ట‌ర్‌` అనే పుస్త‌కం ఆధారంగా తెర‌కెక్కించ‌నున్న చిత్రంలో విద్యాబాల‌న్ న‌టించ‌నుంది. సాగ‌రిక ట్విట్ట‌ర్‌లో ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. బాల‌న్‌తో ఆ మేర‌కు రాయ్‌కపూర్‌ ఫిలింస్ సంస్థ‌ కాంట్రాక్ట్ పూర్త‌యింద‌ని సాగ‌రిక వెల్ల‌డించారు.